Madilo Madilo Movie First Look Poster Released By Sai Rajesh - Sakshi
Sakshi News home page

'మదిలో మది'పెద్ద విజయం సాధించాలి: ‘బేబీ’ దర్శకుడు

Aug 2 2023 6:37 PM | Updated on Aug 2 2023 6:53 PM

Madilo Madilo Movie First Look Poster Released By Sai Rajesh - Sakshi

టాలీవుడ్‌లో ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. లవ్‌స్టోరీలో వైవిద్యం ఉంటే చాలు ఆ చిత్రాన్ని కచ్చితంగా హిట్‌ చేస్తారు. అందుకు మంచి ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘బేబీ’ మూవీ. యువతను ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ తీసిన బేబి సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటి కోవలోకి చెందే మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా మదిలో మది అనే చిత్రం రాబోతోంది. జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బేబి మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..  ‘మదిలో మది సినిమా ఆగస్ట్ 18న విడుదల కాబోతోంది. నేను ట్రైలర్‌ను చూశాను అద్భుతంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ ’ అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement