
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ ముగిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. పోలింగ్ ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 83శాతానికి పైగా పోలింగ్ (మధ్యాహ్నం 3గంటల వరకు) నమోదయ్యింది. గతేడాది కేవలం కేవలం 474 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా, ఈసారి మాత్రం 666 మందికి పైగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చదవండి: MAA Elections 2021 Live Updates: ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్
చిరంజీవి, పవన్ కల్యాణ్ ,బాలకృష్ణతో పాటు నాగార్జున వంటి ప్రముఖులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరి కొందరు నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేశ్,అల్లు అర్జున్,మహేశ్‌బాబు, నితిన్, రానా, రవితేజ, నాగ చైతన్య వంటి అగ్ర హీరోలు మాత్రం ఓటు వేయడానికి రాలేదు. ఇక హీరోయిన్స్‌లలో అనుష్క, సమంత, రకుల్, ఇలియానా, త్రిష, హన్సిక సైతం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. షూటింగ్స్‌లో బిజీగా ఉండటంతో ఓటు వేసేందుకు రాలేదని తెలుస్తుంది. చదవండి: MAA Elections 2021: శివబాలాజీ, సమీర్ మధ్య తీవ్ర ఘర్షణ