Prakash Raj: 'పెద్దల ఆశీర్వాదం నొకొద్దు.. సత్తా ఉన్నవాడే గెలవాలి'

MAA Elections 2021: Prakash Raj Sensational Commens On Maa Elections - Sakshi

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పెద్దల ఆశీర్వాదం నాకొద్దు. మా ఎన్నికల్లో నా సత్తాపై గెలుస్తా. పెద్దలను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే అధ్యక్షుడిగా గెలవాలి. దయతో గెలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చోవాలి. మా ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారు. నేను ఒక ఉత్తరం రాస్తే మా అసోసియేషన్‌కు  తాళం పడేది. సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడటం కూడా తెలుసు.
చదవండి: MAA Elections 2021: మంచు విష్ణుకు బాలయ్య మద్ధతు

నరేష్ అహంకారి, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. మా అసోసియేషన్ సిగ్గుపడేలా నరేష్ ప్రవర్తిస్తున్నారు.నన్ను తెలుగువాడు కాదని నరేష్‌ అన్నారు. కానీ నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్‌లో ఎవరికి రాదు. నన్ను పెంచింది తెలుగు భాష. మా అసోసియేషన్ కోసం ఒక బాధ్యత పనిచేయాలని వచ్చాను.

మా సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంది. చాలా బాధతో, ఆక్రోశంతో సమస్యలను పరిష్కరించాలని పోటీ చేస్తున్నాం. మీరు గెలవడానికి ప్రయత్నించండి, అవతలివారిని ఓడించడానికి కాదంటూ మంచు విష్ణుకు పరోక్షంగా ఆయన కౌంటర్‌ వేశారు. చదవండి: ఆర్టిస్టులకు లోకల్‌, నాన్‌ లోకల్‌ ఉండదు: సుమన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top