‘లైఫ్‌: ఏ ట్రూ బ్లెస్సింగ్‌’ హీరోకు అరుదైన ఘనత

Life Short Film Fame Rutvik Nominated In Cannes World Film Festival - Sakshi

రుత్విక్‌ రెడ్డి స్త్రీ, పురుష పాత్రల్లో నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘లైఫ్‌: ఏ ట్రూ బ్లెస్సింగ్‌’. విజయ్‌దాస్‌ దర్శకత్వంలో శ్రీలతా రెడ్డి నిర్మించారు. ఇటీవల ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ట్రూ బ్లెస్సింగ్‌ టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా రుత్విక్‌కి బ్లెస్సింగ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ‘బెస్ట్‌ యంగ్‌ యాక్టర్‌ ఇన్‌ ఏ షార్ట్‌ ఫిల్మ్‌’ కేటగిరీలో రుత్విక్‌కు ‘కాన్స్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో నామినేషన్‌ దక్కింది.

చిన్న అంశాలకే భయపడి ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్‌ కాదు, మహిళలపై లైంగిక దాడులను అరికట్టాలి, లింగమార్పిడి అనేది ప్రకృతి విరుద్ధం వంటి అంశాల నేపథ్యంలో ‘లైఫ్‌: ఏ ట్రూ బ్లెస్సింగ్‌’ రూపొందింది. మే 17 నుంచి 28 వరకూ ఫ్రాన్స్‌లో కాన్స్‌ చిత్రోత్సవాలు జరగనున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top