Vijay Birthday: విజయ్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత స్పెషల్ గిఫ్ట్..

చెన్నై సినిమా: దళపతి విజయ్ పుట్టినరోజు అంటే ఆయన అభిమానులకు పండుగ కంటే ఎక్కువ. ఆలయాల‍్లో పూజలు, అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలతో తమ అభిమానాన్ని చాటుకుంటారు. సినీ నిర్మాతల శుభాకాంక్షల ప్రకటనలతో హోరెత్తిస్తుంటారు. కాగా ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు. దీంతో అభిమానుల హంగామా ఇప్పటికే మొదలైంది. ఇక సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత లలిత్‌కుమార్ కోలీవుడ్‌లో భారీ చిత్రాల నిర్మాతగా రాణిస్తున్నా రు. ఇటీవల ఆయన మహాన్, కాత్తువాక్కల రెండు కాదల్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తాజాగా చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నిర్మిస్తున్న కోబ్రా చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇకపోతే నటుడు విజయ్ అంటే లలిత్‌కుమార్ చాలా అభిమానం. గత 2020 నుంచి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా సీడీ (కామన్ డిజైన్)లను విడుదల చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. అదే విధంగా ఆదివారం విజయ్ కామన్ డిజైన్‌ను విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాకుండా విజయ్ బర్త్‌డేకు సంబంధించి ఓ ప్రత్యేకమైన వీడియోను సోమవారం (జూన్ 20) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరో విశేషం ఏమిటంటే విజయ్ 67వ చిత్రాన్ని లలిత్‌కుమారే నిర్మించబోతున్నారు.
చదవండి: దేవుడిచ్చిన లోపాన్ని కూడా సరిచేసే తల్లి కథ..
లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..
தளபதியின் நாளைய தீர்ப்பு முதல் மக்களின் இன்றைய தீர்ப்பு வரை 🔥♥️
Presenting you all the #ThalapathyBirthdaySpecialPoster 💥
Advance birthday wishes to our dear most #Thalapathy @actorvijay Sir 🎂♥️ pic.twitter.com/c8sLsUptSy
— Seven Screen Studio (@7screenstudio) June 19, 2022
We are not done yet, #ThalapathyBirthdaySpecialVideo from us out tomorrow at 5PM ♥️🔥
On Our YT Channel ➡️https://t.co/oJ5PdYCm5a
Celebrating #Thalapathy @actorvijay ♥️🔥 pic.twitter.com/zokv1suhed
— Seven Screen Studio (@7screenstudio) June 19, 2022
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు