
ముఖ్యమంత్రి స్టాలిన్, విజయ్ ఫొటోలతో పోస్టర్
సాక్షి, చెన్నై : విజయ్ పుట్టిన రోజుని పురస్కరించుకుని కొందరు అభిమానులు వివాదాస్పదమైన పోస్టులతో కలకలం సృష్టిస్తున్నారు. విజయ్ తాజా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం విడుదల చేయనున్నారు. దిండుక్కల్ ప్రాంతానికి చెందిన విజయ్ మక్కల్ సంఘం కార్యకర్తలు ముఖ్యమంత్రి స్టాలిన్, విజయ్ ఫొటోలతో ఆదివారం పోస్టర్లను విడుదల చేశారు. అందులో విజయ్‌కు స్టాలిన్ రాజదండం అందిస్తున్నట్లు ఉంది. ‘పేద ప్రజల కోసం మంచి పాలన అందించడానికి తమ్ముడు రా! సారథ్యం వహించడానికి రా ! అనే వ్యాఖ్యాలను పోస్టర్లపై పొందుపరిచారు.
చదవండి:
MAA Elections: ప్రకాశ్‌రాజ్ వర్సెస్ మంచు విష్ణు!