లక్ష్ చదలవాడ ‘ ధీర ’ వచ్చేస్తోంది | Laksh Chadalavada Action Extravaganza 'Dheera' Release Date Out | Sakshi
Sakshi News home page

లక్ష్ చదలవాడ ‘ ధీర ’ వచ్చేస్తోంది

Jan 10 2024 2:50 PM | Updated on Jan 10 2024 3:05 PM

Laksh Chadalavada Action Extravaganza Dheera Release Date Out - Sakshi

కంటెంట్‌ బాగుంటే చాలు చిన్న, పెద్ద సినిమా అని తేడా లేకుండా థియేటర్స్‌కి వస్తున్నారు ప్రేక్షకులు. కథ-కథనంలో కొత్తదనం ఉంటే హీరో హీరోయిన్లు ఎవరనేది కూడా పట్టించుకోవడం లేదు. అందుకే టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్స్‌, యాక్టర్స్‌ న్యూ ఏజ్‌ కంటెంట్‌తో వచ్చి హిట్లు కొడుతున్నారు.  అలా టాలీవుడ్ యంగ్ హీరోల్లో లక్ష్ చదలవాడ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు.

వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల్లో లక్ష్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ధీర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ధీర మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement