ఖరీదైన కారు కొన్న బుల్లితెర నటి.. ఎన్ని లక్షలంటే? | Kundali Bhagya Actress Adrija Roy Buys Swanky New BMW Car | Sakshi
Sakshi News home page

Adrija Roy: బీఎండబ్ల‍్యూ కారు కొన్న కుండలి భాగ్య నటి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!

Aug 5 2024 8:07 PM | Updated on Aug 5 2024 8:14 PM

Kundali Bhagya Actress Adrija Roy Buys Swanky New BMW Car

ఇమ్లీ సీరియల్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అద్రిజా రాయ్.  ప్రస్తుతం  ఆమె కుండలి భాగ్య సీరియల్‌లో నటిస్తోంది. దుర్గా ఔర్ చారుతో తన కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ బుల్లితెర అభిమానులను అలరిస్తోంది. బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించిన ఆద్రిజా తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

 నా కష్టం, దృఢ సంకల్పంతో మొదటి కారును కొనుగోలు చేసినట్లు ఆద్రిజా రాయ్ తెలిపింది. ఈ కారు విలువ దాదాపు రూ.65 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల ప్రేమనే తనను ముందుకు నడిపిస్తున్నదని నటి పేర్కొంది. కుండలి భాగ్య సీరియల్‌లో నటించడం మంచి అనుభవమని.. తాను ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉందని అద్రిజ రాయ్ వెల్లడించింది. నా ముందు ఇంకా ఎన్నో మైలురాళ్లు ఉన్నాయని వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement