మానవ సంబంధాల నేపథ్యంలో...

Ksheera Sagara Madhanam movie updates - Sakshi

మానస్‌ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ కుమార్‌ హీరోలుగా, అక్షత సోనావని హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్‌ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్‌ అండ్‌ హార్ట్‌ క్రియేష¯Œ ్స నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అనిల్‌ పంగులూరి మాట్లాడుతూ– ‘‘దర్శకుడు క్రిష్‌ విడుదల చేసిన మా సినిమా టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే లక్ష మంది టీజర్‌ని వీక్షించారు. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌ అరసాడ, కెమెరా: సంతోష శానమోని, సహ–దర్శకుడు: కిషోర్‌ కృష్ణ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top