కృష్ణ బర్త్‌డే: మెగాస్టార్‌ చిరంజీవి స్పెషల్‌ విషెస్‌

Krishna Birthday Celebration AMong Family Photos Goes Viral - Sakshi

అల్లూరి సీతారామ రాజుగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణ నేటితో 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. హీరోగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని సాహసానికి మారుపేరుగా నిలిచారు ఆయన. నేడు (మే 31) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు బర్త్‌డే విషెష్‌ తెలుపుతున్నారు. అలాగే ఆయన తనయుడు, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తన తండ్రికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

ఇదిలా ఉండగా కృష్ణ చిన్నల్లుడు, హీరో సుధీర్‌ బాబు ఆయన జన్మదిన వేడుకలను తన ఇంటిలో గ్రాండ్‌గా ఏర్పాటు చేశాడు. కృష్ణ సతీమణి ఇందిర, మిగతా కుటుంబ సభ్యులు సమక్షంలో ఆయన కేక్‌ కట్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, పెద్ద అల్లుడు గల్లా జయదేవ్‌, నటుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా కృష్ణ‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. “సాహసానికి మారుపేరు, మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వారు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే సార్” అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top