ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. కాస్తా లేట్ అంతే..! | kollywood Actor Aravind Akash gets married in Malaysia | Sakshi
Sakshi News home page

Aravind Akash: ప్రియురాలితో గోట్ నటుడి పెళ్లి.. మలేసియాలో గ్రాండ్ వెడ్డింగ్

Jul 2 2026 5:37 PM | Updated on Jul 2 2026 6:08 PM

kollywood Actor Aravind Akash gets married in Malaysia

ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. జూన్ నుంచే ముహుర్తాలు షురూ కావడంతో పెళ్లిళ్ల సందడి మొదలైంది. తాజాగా మరో నటుడు పెళ్లీపీటలెక్కారు. తమిళ, మలయాళ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరవింద్ ఆకాశ్ ఓ ఇంటివాడయ్యారు. ఈయన దాదాపు 50 ఏళ్ల వయసులో తన ప్రియురాలు సారాను పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి వేడుక మలేసియాలోని కౌలాలంపూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. 

ఈ పెళ్లి వేడుకలో దర్శకుడు వెంకట్ ప్రభు, నటుడు వైభవ్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న అరవింద్.. పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కాగా. అరవింద్ ఆకాశ్ కోలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.  చెన్నై 600028, గోవా, సరోజ, మంకథ, బిర్యానీ, మాస్ ఎంగిర మసిలమణి, చెన్నై 600028 II, మానాడు, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాల్లో కనిపించారు. అరవింద్ ఎక్కువగా వెంకట్ ప్రభు డైరెక్ట్ మూవీస్‌లో నటించడం విశేషం.  

తమిళంతో పాటు మలయాళ చిత్రసీమలోనూ అరవింద్ ఆకాశ్ మెప్పంచారు. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన 'నందనం' చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రకు  బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మలయాళంలో కూట్టు, వాంటెడ్, వజ్రం, పొన్ముడిపుళయోరతు, మమ్మీ అండ్ మీ, ప్రజాపతి లాంటి సినిమాలు చేశారు. ఇటీవలే పృథ్వీరాజ్-బాసిల్ జోసెఫ్ నటించిన 'గురువాయూరంబాల నడయిల్' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. కాగా.. అరవింద్ చివరిసారిగా 2024లో విజయ్ నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో నటించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement