Kiruthiga Udhayanidhi: హీరో శింబుపై మహిళా డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Kiruthiga Udhayanidhi Interesting Comments On Simbu At Paper Rocket Audio Launch - Sakshi

ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. ఓటీటీ సంస్థలే వీటిని స్ట్రీమింగ్‌ చేయడానికి అధిక ఆసక్తిని కనబరుస్తున్నాయి. పెట్టుబడికి ముప్పు లేకపోవడంతో దర్శక, నిర్మాతలు కూడా వెబ్‌సిరీస్‌లను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. ఆ విధంగా తాజాగా రూపొందిన వెబ్‌ సిరీస్‌ ‘పేపర్‌ రాకెట్‌’. ఇది జీ చానల్‌ ఒరిజినల్‌ వెబ్‌సిరీస్‌. శ్రీనిధి సాగర్‌ నిర్మించిన దీనికి కృత్తిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. కాళిదాస్‌ జయరామ్, తాన్యా రవిచంద్రన్‌ జంటగా నటించిన ఇందులో గౌరీ జి.కిషన్, నాగివీడు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌ ఈ నెల 29వ తేదీ నుంచి జీ చానల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

చదవండి: జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది

ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఉదయనిధి స్టాలిన్, శింబు, విజయ్‌ ఆంటోని, దర్శకుడు మిష్కిన్, మారి సెల్వరాజ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై దర్శకురాలు కృతిక మాట్లాడుతూ.. తనను ప్రోత్సహిస్తున్న తన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. నటుడు శింబుతో చిత్రం చేయాలన్నది తన కోరిక అని, అది ఈ ఆరంభంలో జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. శింబు తొలిసారి హీరోగా నటిస్తున్నప్పుడు తనకి ఇంకా పెళ్లి కాలేదని ఒక యాడ్‌ ఏజెన్సీని నిర్వహిస్తున్నారని తెలిపారు. సాధారణంగా రకరకాల విమర్శలు చేస్తుంటారని అదే విధంగా తొలి చిత్రం సమయంలో శింబుపై కూడా ఇతను హీరోనా అని విమర్శలు వచ్చాయని అన్నారు.

చదవండి: మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్‌ షాకింగ్‌ రియాక్షన్‌

అయితే ఆయన నటిస్తున్న తొలి చిత్రం స్టిల్స్‌ బయటకు వచ్చినప్పుడు ఆ చిత్ర యూనిట్‌లో ఉన్నత స్థాయికి ఎదిగేది శింబునే అని తాను భావించానన్నారు. ఇక ఉదయనిధి గురించి చెప్పాలంటే తాను సినిమా ఇండస్ట్రీలోకి వెళుతానని చెప్పగానే ఆయన చాలా ఆలోచించారన్నారు. ఆ తరువాత తాను ఇంటిలో చేసే గోల పడటం కంటే సినిమా రంగంలోకి వెళ్లడమే మంచిదని, తనకు ప్రశాంతంగా ఉంటుందని భావించారేమో గాని సమ్మతించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా మహిళలకు సపోర్టు అందిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని కృతిక ఉదయనిధి అన్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top