'స్టార్‌ హీరోతో లవ్‌.. పేరెంట్స్‌ బలవంతం వల్లే పెళ్లి చేసుకున్నా' | Kiran Rao Reveals She And Aamir Khan Got Married Because Of Parental Pressure, Deets Inside | Sakshi
Sakshi News home page

Kiran Rao: ఏడాదిపాటు లివ్‌ ఇన్‌ రిలేషన్‌.. వాళ్ల ఒత్తిడి వల్లే పెళ్లి!

Published Thu, May 23 2024 2:26 PM

Kiran Rao Says She and Aamir Khan Got Married Because of Parental Pressure

లవ్‌ మ్యారేజ్‌.. అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌.. దాదాపు ఈ రెండే అందరికీ తెలుసు.. అయితే సహజీవనం చేశాకే పెళ్లి చేసుకోమని సీనియర్‌ నటి జీనత్‌ అమన్‌ ఆ మధ్య కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీన్ని ఇప్పటికే కొందరు పాటిస్తుండగా ఓ బాలీవుడ్‌ స్టార్‌ జంట ఎప్పుడో ఫాలో అయింది. ఆమిర్‌ ఖాన్‌- కిరణ్‌ రావు.. వివాహానికి ముందు కలిసున్నారు.

పేరెంట్స్‌ బలవంతం వల్లే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్‌ రావు మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్తున్నా.. నేను, ఆమిర్‌ ఏడాదిపాటు సహజీవనం చేశాము. పేరెంట్స్‌ బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నాం. వివాహం అనే ఇన్‌స్టిట్యూట్‌లో భార్యాభర్తలుగా, విడివిడిగానూ పని చేస్తే అది చాలా బాగా వర్కవుట్‌ అవుతుంది.

కోతులుగా ఉన్నప్పుడు..
కానీ ఈ పెళ్లి అనేది అమ్మాయిలను ఎంతగా అణిచివేస్తుందనేది మాత్రం ఎవరూ మాట్లాడరు. అమెరికన్‌ సైకాలిజస్ట్‌ ఎస్తర్‌ పెరల్‌ దీని గురించి అద్భుతమైన పుస్తకం రాశాడు. మనం కోతులుగా జీవించినప్పుడు కలిసున్నాం. తర్వాత కాలక్రమేణా మానవులు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 

పెళ్లి వల్ల మహిళలపై ఒత్తిడి
దానివల్ల మహిళలపై ఒత్తిడి పెరిగింది. కుటుంబాన్ని చూసుకోవాలి. అందరూ కలిసుండేందుకు తోడ్పడాలి. పని చేయాలి. దీనికితోడు అత్తామామ, ఆడపడుచులు సహా భర్త వైపు కుటుంబీకులందరితో టచ్‌లో ఉండాలి. ఇలా ఆ మహిళ దగ్గరి నుంచి ఎన్నో ఆశిస్తూ తనపై ఒత్తిడి పెంచుతారు' అని చెప్పుకొచ్చింది.

అప్పుడు పరిచయం మాత్రమే
కాగా ఆమిర్‌.. కిరణ్‌ రావు 'లగాన్‌' సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ మూవీలో ఆమిర్‌ హీరోగా నటించగా కిరణ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించింది. అప్పుడు పరిచయం మాత్రమే ఏర్పడింది. ఆమిర్‌ మంగళ్‌ పాండే, కిరణ్‌ రావు స్వదేశ్‌ సినిమా చేస్తున్న సమయంలో కమర్షియల్‌ యాడ్స్‌కు కలిసి పని చేశారు. 

డేటింగ్‌.. పెళ్లి
అప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా 2004లో డేటింగ్‌ చేయగా 2005లో పెళ్లి చేసుకున్నారు. 2011లో సరోగసి ద్వారా ఆజాద్‌ అనే కుమారుడికి పేరెంట్స్‌ అయ్యారు. 2021లో ఆమిర్‌- కిరణ్‌ విడిపోయారు.

చదవండి: పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement