Kiran Abbavaram Plan To Multi Starrer Movie With Star Hero - Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: స్టార్‌ హీరోతో కిరణ్‌ అబ్బవరం మల్టీస్టారర్‌!

Apr 25 2023 7:08 AM | Updated on Apr 25 2023 9:39 AM

Kiran Abbavaram Plan To Multi Starrer Movie With Star Hero - Sakshi

వరుస చిత్రాలతో బిజీగా దూసుకెళుతున్నారు హీరో కిరణ్‌ అబ్బవరం. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు తన చిత్రాల్లో కొన్నింటికి కథలు కూడా రాసుకుంటున్నారాయన. ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం, నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రాలకు కథ అందించిన కిరణ్‌ తాజాగా ఓ మల్టీస్టారర్‌ మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు.

(చదవండి: అందుకు పదేళ్లు పట్టింది)

ఓ స్టార్‌ హీరో నటించనున్న ఈ చిత్రంలో కిరణ్‌ కూడా ఓ హీరోగా నటించనున్నారు. నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ మల్టీస్టారర్‌ మూవీని ఓ పెద్ద సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాతో పాటు మరో మూడు భారీ ప్రాజెక్టుల్లో నటించ నున్నారు కిరణ్‌. కాగా రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’ విడుదలకు సిద్ధం అవుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement