ఏడాది పూర్తి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో హిట్‌ మూవీ! | Kiran Abbavaram's Hit Movie Vinaro Bhagyamu Vishnu Katha Completes One year | Sakshi
Sakshi News home page

Vinaro Bhagyamu Vishnu Katha: ఏడాది పూర్తి చేసుకున్న వినరో భాగ్యము విష్ణు కథ!!

Feb 18 2024 3:50 PM | Updated on Feb 18 2024 4:13 PM

Kiran Abbavaram Hit Movie Vinaro Bhagyamu Vishnu Katha Completes One year - Sakshi

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది ఏకంగా మూడు సినిమాలతో అలరించాడు. వినరో భాగ్యము విష్ణుకథ మూవీతో సూపర్‌ హిట్ కొట్టాడు. ఈ చిత్రంలో కాశ్మీరా పరదేశి హీరోయిన్‌గా నటించింది. చిత్రంలో కాశ్మీరా పరదేశి హీరోయిన్‌గా నటించింది.  ఆ  తర్వాత వచ్చిన రూల్స్ రంజన్, మీటర్‌ చిత్రాలతో ఫర్వాలేదనిపించాడు. గతేడాది ఫిబ్రవరి 18న విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ మొదటి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. నూతన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. 

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం అద్భుతమైన నటనతో మెప్పించారు. సకుటుంబంగా ప్రేక్షకులు చూసే మంచి కథా కథనాలతో అందరినీ ఆకట్టుకుందీ సినిమా. మీడియా నుంచి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న వినరో భాగ్యము విష్ణు కథ మల్టీ జానర్ మూవీగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. కిరణ్ అబ్బవరం ఇలాంటి తరహా చిత్రాలు మరిన్ని చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన దిల్ రూబా అనే సినిమాతో పాటు సొంత ప్రొడక్షన్‌లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement