విడాకులు రాకముందే.. కోటీశ్వరుల క్యూ

Kim Kardashian Dating Proposals Before Divorce - Sakshi

ఉన్నట్లుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అభిమానుల్ని షాక్‌ గురిచేశారు కేన్‌ వెస్ట్‌-కిమ్‌ కర్దాషియన్‌ జంట. తమ బంధం ఇక  కొనసాగడం కష్టమని ప్రకటిస్తూ టీవీ సెలబ్రిటీ కిమ్‌ ఫిబ్రవరిలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆరేళ్ల బంధాన్ని తెంచుకుంటూ పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు వాళ్లిద్దరూ ఒప్పుకున్నారు. అంతేకాదు నలుగురు పిల్లల బాధ్యతలను జాయింట్‌గా చూసుకుంటామని కోర్టులో ఒక ఒప్పందానికి వచ్చారు కూడా. అయితే విడాకులు మంజూరుకాకముందే ఆమె మరో సెలబ్రిటీతో డేటింగ్‌ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 

హై ప్రొఫైల్‌ సెలబ్రిటీ అయిన కిమ్‌ కర్దాషియన్‌తో డేటింగ్‌ కోసం బడా బాబులు ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు నేరుగా ఆమెకు మేసేజ్‌లు పెడుతుండగా, మరికొందరు మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ సాయంతో ఆమెను కాంటాక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె సన్నిహితవర్గాలు చెప్తున్నాయి. బిలీయనీర్లు, బడా కంపెనీల సీఈవోలు, కొందరు ఏ-లిస్ట్‌ యాక్టర్లు, రాయల్‌ ఫ్యామిలీస్‌ నుంచి కూడా ఆమెకు డేటింగ్‌ ప్రపోజల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పట్లో ఆమెకు డేటింగ్‌ ఆలోచన లేదని తెలుస్తోంది. 

కేన్‌ వెస్ట్‌తో బంధం తెగ్గొట్టుకునే టైంలో ఆమె కుంగుబాటుకి లోనైందని, దాని నుంచి కోలుకున్న తర్వాతే ఏ ఆలోచన అయినా చేస్తానని ఆమె సన్నిహితులతో చెప్పినట్లు పేజ్‌ సిక్స్‌ మ్యాగజీన్‌ కథనం ప్రచురించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top