Kichcha Sudeep Vikrant Rona Movie Official Trailer Out Now, Watch Trailer - Sakshi
Sakshi News home page

Vikrant Rona: విక్రాంత్‌ రోణ ట్రైలర్‌ చూశారా?

Jun 23 2022 6:27 PM | Updated on Jun 23 2022 7:16 PM

Kichcha Sudeep Vikrant Rona Official Trailer Out Now - Sakshi

ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథని దాచాలనుకుంటున్నారు. కథని దాచగలరు, కానీ భయాన్ని దాచలేరు, ఆ కథ మళ్లీ మొదలైంది. ఆ డెవిల్‌ మళ్లీ వచ్చాడు.. అంటూ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది.

కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నిరూప్‌ భండారి, నీతా అశోక్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. అనూప్‌ భండారి దర్శకుడు. జాక్‌ మంజునాథ్, షాలినీ మంజునాథ్‌ నిర్మించారు. గురువారం ఈ సినిమా నుంచి ట్రైలర్‌ రిలీజైంది. 'ఆ ఊరే ఒక మర్మమైన ఊరు. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథని దాచాలనుకుంటున్నారు. కథని దాచగలరు, కానీ భయాన్ని దాచలేరు, ఆ కథ మళ్లీ మొదలైంది. ఆ డెవిల్‌ మళ్లీ వచ్చాడు..' అంటూ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది.

భయం నిండిన ఆ ఊరిలో భయం అంటే ఏమిటో తెలియని ఒకడు వచ్చాడు అంటూ విక్రాంత్‌ రోణగా సుదీప్‌ పాత్రను పరిచయం చేశారు. ట్రైలర్‌ చూస్తుంటే అద్భుతంగా ఉంది. కాగా ఈ సినిమాకు ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌  (దాదాపు రూ. 100 కోట్లు) ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట. కానీ ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడానికి దీన్ని థియేటర్‌లోనే రిలీజ్‌ చేస్తున్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్‌ అనూప్‌. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజైన ‘రా రా రాక్కమ్మా’ సాంగ్‌ విశేష ఆదరణ పొందిన విషయం విదితమే! రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను మంగ్లీ, నకాష్‌ అజీజ్‌ పాడారు. ఈ త్రీడీ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 28న విడుదలవుతోంది’

చదవండి: 

Advertisement
 
Advertisement
Advertisement