Kichcha Sudeep: గో సంరక్షణ రాయబారిగా హీరో కిచ్చా సుదీప్

యశవంతపుర: గో సంరక్షణ రాయబారిగా నటుడు సుదీప్‌ను ఎంపిక చేసినట్లు పశు సంవర్థక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ తెలిపారు. పశుపాలనకు ప్రాధాన్యం కల్పించి పశు సంరక్షణకు ప్రభుత్వం తీసుకువచ్చిన పుణ్యకోటి దత్తు యోజన రాయబారిగా ఎంపికైన సుదీప్‌కు లేఖ రాసి అభినందనలు చెప్పినట్లు మంత్రి వివరించారు. గో సంరక్షణ రాయబారిగా సుదీప్‌తో శాఖకు మంచి బలం చేకూరినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంలో సుదీప్ పుట్టిన రోజు కావడంతో మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
సుదీప్ ఇంటి వద్ద సందడి
నటుడు సుదీప్ పుట్టినరోజు పురస్కరించుకుని ఇక్కడి జేపీ నగరలో గురువారం రాత్రి అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కబ్జా పోస్టర్‌ను విడుదల చేశారు.