KGF Chapter 2: ‘ఎదగరా.. ..దినకర’ హృదయాలను హత్తుకుంటున్న అమ్మ పాట

KGF Chapter 2 : Yadagara Yadagara Lyrical Song Out - Sakshi

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రికార్డులు సృష్టించిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ఈ ఒక్క సినిమా.. కన్నడ హీరో యశ్‌ని పాన్‌ ఇండియా స్టార్‌గా మార్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది చిత్ర యూనిట్‌. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్‌ చేశాయి.

తాజాగా ఈ చిత్రం నుంచి అమ్మ పాట (వాయిస్‌ ఆఫ్‌ ఎవ్రీ మదర్‌)ను విడుదల చేశారు. ‘ఎదగరా.. ఎదగరా’ అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చిన ఈ పాటకి తెలుగులో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, సుచేత బస్రూర్ అద్భుతంగా ఆలపించారు.  ఈ సినిమాలో  శ్రీనిధి హీరోయిన్‌గా నటించగా,  సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top