KGF Chapter 2 : అరుదైన రికార్డు సాధించిన ‘రాఖీ భాయ్‌’ | KGF Chapter 2 Teaser: First Kannada Teaser To Creates Record With Comments | Sakshi
Sakshi News home page

KGF Chapter 2 : అరుదైన రికార్డు సాధించిన ‘రాఖీ భాయ్‌’

Jun 1 2021 12:56 PM | Updated on Jun 1 2021 12:56 PM

KGF Chapter 2 Teaser: First Kannada Teaser To Creates Record With Comments - Sakshi

కేజీఎఫ్‌ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా అది. ఆ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2.  ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ వచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ  సినిమా కోసం అన్ని భాషల  ఆడియన్స్  ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

యశ్‌ బర్త్‌డే సందర్భంగా జనవరి 7న విడుదలైన ఈ మూవీ టీజర్‌ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. అతి తక్కువ రోజుల్లోనే 10 లక్షలకు పైగా మంది ఈ టీజర్‌పై కామెంంట్స్‌‌ చేశారు. అలాగే 188 మిలియన్స్‌ వ్యూస్‌ని, 8 మిలియన్స్‌కి పైగా లైకులు సొంతం చేసుకుంది.  ఈ విషయాన్ని ట్వీటర్‌ వేదికగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ వెల్లడించింది. ప్రశాంత్‌ నీల్‌దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌వీనా టాండ‌న్‌, సంజ‌య్ ద‌త్‌, రావు ర‌మేశ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా లెంగ్త్‌ మూడు గంటలకు పైనే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. భారీ స్టార్‌ కాస్ట్‌ ఉండటం కంటెంట్ పరంగానూ ఎక్కువ స్కోప్‌ ఉండటంతో సినిమాను కాస్త లెంగ్తీగానే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement