KGF Chapter 2: సౌత్ శాటిలైట్ రేట్స్ కొనుగోలు చేసిందెవరంటే.. | KGF Chapter 2 Satellite Rights: South Satellite Rights Sold Whopping Price | Sakshi
Sakshi News home page

KGF Chapter 2 Satellite Rights: సౌత్ శాటిలైట్ రేట్స్ కొనుగోలు చేసిందెవరంటే

Aug 20 2021 6:43 PM | Updated on Aug 20 2021 7:35 PM

KGF Chapter 2 Satellite Rights: South Satellite Rights Sold Whopping Price - Sakshi

కేజీఎఫ్‌ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా అది. ఆ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2.  ఈ సినిమా విడుదలకు ముందే భారీ రికార్డ్సు సృష్టిస్తోంది.. ఇప్పటికే ఈ విడుదలైన టీజర్, పోస్టర్స్‏తో సినిమా ఏ రెంజ్‏లో అర్థమవుతుంది. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌.

కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 సౌత్ ఇండియన్ అన్ని భాషల శాటిలైట్ హక్కులను జీ సంస్థ కొనుగోలు చేసినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల శాటిలైట్ హక్కులను జీ టెలివిజన్ సంస్థ తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. దీని కోసం జీ సంస్థ భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో  శ్రీనిధి హీరోయిన్‌గా నటించగా,  సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తది తరులు కీలక పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
Advertisement