KGF Actor Yash Birthday Special: Rare And Unknown Facts In Telugu - Sakshi
Sakshi News home page

Yash: ఆకలితో అలమటించి.. బస్టాండ్‌లో నిద్ర.. అదే చోట భారీ కటౌట్‌.. దటీజ్‌ యశ్‌!

Jan 8 2022 11:23 AM | Updated on Jan 8 2022 4:34 PM

KGF Actor Yash Birthday Special: Rare And Unknown Facts In Telugu - Sakshi

కేజీఎఫ్‌ సినిమాలో ఎలా అయితే రాకీ భాయ్‌ ఒక్కో మెట్టు ఎక్కి డాన్‌ అయ్యాడో.. అచ్చం అలానే యశ్‌ కూడా సామాన్యుడి నుంచి స్టార్‌ దాకా ఎదిగాడు

యశ్‌.. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయిన హీరో. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న ఈయన.. కేజీఎఫ్‌ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక్క సినిమాతో యశ్‌కు అన్ని భాషల్లో అభిమానులు పెరిగిపోయారు. ఈ రోజు యశ్‌ 36వ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు  మీకోసం..

కేజీఎఫ్‌ సినిమాలో ఎలా అయితే రాకీ భాయ్‌ ఒక్కో మెట్టు ఎక్కి డాన్‌ అయ్యాడో.. అచ్చం అలానే యశ్‌ కూడా సామాన్యుడి నుంచి స్టార్‌ దాకా ఎదిగాడు. యశ్‌ అస‌లు పేరు నవీన్ కుమార్ గౌడ. అభిమానులు ముద్దుగా రాకింగ్‌ స్టార్‌ అని పిలుసుకుంటారు.  జనవరి 8, 1986 న కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో జ‌న్మించాడు యశ్‌.అతని తండ్రి కేఎస్ ఆర్టీసీ రవాణా సేవలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు.

చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే యశ్‌కి పిచ్చి. మైసూర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత వెంటనే సినీమాలో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇంట్లో వాళ్లని ఒప్పించి మూడు వందల రూపాయలతో బెంగళూరు వచ్చాడట. బంధువులు ఇంటికి వెళ్లలేక కెంపెగౌడ బస్టాండ్‌లో చాలా రాత్రులు గడిపాడట. ఏదో ఒకరోజు అక్కడ తన కటౌట్‌ ఉండాలని గట్టిగా ఫిక్స్‌ అయ్యాడట. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని సీరియల్స్‌ అవకాశాలు సంపాదించుకున్నాడు. 

ఆ తరువాత సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. 2008 లో తన భార్య రాధిక పండిట్ సరసన మోగ్గినా మనసు చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతేక ఆదు యశ్‌కు మొదటి ఫిలింఫేర్ అవార్డును సంపాదించింది. ఇక  2016 లో తన మొదటి సినిమా హీరోయిన్ రాధిక పండిట్‌‌ను పెళ్లిచేసుకోగా, వీరికి ఇద్ద‌రు సంతానం.  ఐరా అనే కూతురు,  యథ‌ర్వ్‌ అనే కొడుకు ఉన్నారు. కూతురు ఐరా 2018 డిసెంబర్‌లో జన్మించగా.. 2019 అక్టోబర్‌లో ఈ జంట యథ‌ర్వ్ కు జన్మనిచ్చింది.

కేజీఎఫ్ మూవీతో తిరుగులేని హీరోగా అవతరించాడు యశ్‌. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.  రూ .200 కోట్ల వసూళ్లు చేసిన మొదటి కన్నడ నటుడుగా నిలిచాడు.  కేజీఎఫ్‌ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ ప్రతి ప్రాజెక్టుకు రూ .15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. 

అంతేకాదు..తను ఏ బస్టాండ్‌లో అయితే ఆకలితో నిద్రలేని రాత్రులు గడిపాడో.. అదే బాస్టాండ్‌(కెంపెగౌడ బస్టాండ్)లో యశ్‌కు 216 అడుగుల కటౌట్‌ ఏర్పాటు చేశారు అభిమానులు. యశ్‌ 34వ బర్త్‌డే సందర్భంగా ఈ భారీ కటౌట్‌లో పాటు..  ఏకంగా 5వేల కేజీల భారీ కేకును తీసుకొచ్చారు. అప్పట్లో అది రికార్డుకెక్కింది.  ఇండియా వరల్డ్‌ రికార్ట్స్‌  యష్‌ బర్త్‌ డే కేకును ‘వరల్డ్‌ బిగ్గెస్ట్‌ సెలబ్రిటీ బర్త్‌ డే కేకు’ప్రకటించింది. 

ఇక గతేడాది విడుద‌లైన కేజీఎఫ్ 2 టీజ‌ర్ రికార్డులు సృష్టిస్తుంది. త‌క్కువ స‌మ‌యంలో మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్ రాబ‌డుతూ రికార్డులు కొల్ల‌గొడుతుంది.దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ మూవీలో సంజయ్ దత్, రవీనాటాండన్, రావు రమేష్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరాగండూర్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా… రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా యశ్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో యశ్‌ సీరియస్ గా కన్పిస్తుండగా, ఆయన ముందు “కాజన్, డేంజర్ ఎహెడ్” అనే బోర్డు కన్పిస్తోంది. మా రాఖీభాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మేకర్స్ ఈ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement