దీపతో మోనిత కండీషన్‌ గురించి చెప్పి ఎమోషనలైన కార్తీక్‌

Karthika Deepam Serial: Karthik Said To Deepa About Monita Conditions - Sakshi

కార్తీకదీపం జూలై 5ఎపిసోడ్‌: మోనిత వీడియో కాల్‌ చేసి కార్తీక్‌ పెళ్లి చీరలు ఎలా ఉన్నాయో నిన్ను అడగమంది అనడంతో దీప రగిలిపోతుంది. ఎంటీదని సౌందర్యను దీప ప్రశ్నిస్తుంది. దీంతో సౌందర్య ఆ మోనిత కావాలనే నిన్ను రెచ్చగోట్టాలని కాల్‌ చేసి వాడిని ఇరికించిందని నా మనసు చెబుతుంది అంటుంది. అంతేగాక వాడు నిజంగా తప్పు చేశాడంటే తను నమ్మలేకపోతున్నానని, ఇందులో ఏదో తెలియని గూడుపుఠాని ఉందని నా మనసు చెబుతుంది దీప, ఒకసారి మనసుతో ఆలోచించు నువ్వు అంటూ తనతో చివరి వరకు కలిసి పోరాడటానికి సాటి స్త్రీగా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానంటూ దీపకు భరోసా ఇచ్చి వెళ్లిపోతుంది సౌందర్య. 

ఇక కార్తీక్‌.. మోనిత దీపకు కాల్‌ చేసి ఇరికించిన సంఘటననే గుర్తు చేసుకుంటూ రోడ్డు మీద నడుచకుంటూ వస్తాడు. అటు వైపే వెళుతున్న సౌందర్య కార్తీక్‌ను చూసి కారు ఆపుతుంది. కార్తీక్‌కు ఎదురుగా వెళ్లి ఏమైందరా అని అడగ్గా నా బతుకులాగే కారు కూడా పాడైందని సమాధానం ఇస్తాడు. దీంతో ఆ మోనిత దగ్గరి నుంచే వస్తున్నావా? అని సౌందర్య ప్రశ్నించడంతో నీకేలా తెలుసంటూ ఆశ్చర్యంగా చూస్తాడు కార్తీక్‌. అప్పుడు కాల్‌ చేసినప్పుడ దీప పక్కనే ఉన్నానని మరిచిపోయావా? అంటుంది. అవునంటూనే మునిగిపోయాను మమ్మీ సుడిగుండంలో ఊపిరి ఆడనడల్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు కార్తీక్‌. 

కార్తీక్‌ నుంచి ఆ మాటలు విని సౌందర్య తట్టుకోలేకపోతుంది. జాలిగా పెద్దోడా అంటూ పెళ్లి బట్టల గురించి ఆరా తీస్తుంది. టైం దగ్గర పడుతోందని కార్తీక్‌ అనగానే స్నేహానికి పరిమితులు ఉంటాయిరా అని అప్పడే చెప్పాను నువ్వు వినలేదని కార్తీక్‌ను మందలిస్తుంది.  అలాగే జరిగిన దాని గురించి ఏం చేయలేమని, జరగబోయేదంటీ? ఆ పెళ్లి, ముహుర్తం సంగతేంటని సౌందర్య కార్తీక్‌ను ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్‌ ఏదీ తన ప్రమేయం లేకుండానే జరుగుతోంది మమ్మీ.. నమ్మండని.. తను నటించడం లేదు అంటూ భావోద్వేగానికి లోనవుతాడు. 

‘నేను మనసులో ఏం అనుకుంటున్నానో అదే చెబుతున్నాను మమ్మీ. నా తప్పు లేకుండానే బాధ్యున్ని అయ్యాను. దీపకు గుడి కట్టి దేవతలా చూసుకోవాలనుకున్నాను. కానీ తన ఆశలకి నేను సమాధి కట్టాను. ఇది పాపమా.. శపమా అర్థం కావడం లేదు’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్‌. సౌందర్య అలా బాధగా చూస్తూ ఉండిపోతుంది. ఇదిలా ఉండగా భాగ్యం ఇంటికి వెళ్లిన హిమ, శౌర్య అమ్మనాన్న ఎందుకు మాట్లాడుకోవడం లేదని భాగ్యాన్ని అడుగుతారు. దీంతో ఆమె ఒక్కసారిగా కంగుతిని త్వరలోనే కలుస్తారంటూ పిల్లలకు సర్థిచెబుతుంది.

మరోవైపు దీప మోనిత వీడియో చేసి చీరలు చూపించిన సీన్‌ గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతుంది. ఇంతలో కార్తీక్‌ వచ్చి దీప ముందు నిలబడతాడు. జరిగినదానికి క్షమాపణలు కోరుతూ పెళ్లి బట్టలు తను కొనలేదని చెబుతాడు. దీంతో ఆ మోనిత సంగతి తనకు తెలుసని, మీరే ఏంటన్నది తనకు అర్థం కావడం లేదంటూ పెళ్లి డేటు, రిజిస్టర్‌ మ్యారేజ్‌పై నిలదీస్తుంది. తనకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. అది విని కార్తీక్ షాక్ అవుతాడు. తడబడుతూనే ఏది తన ప్రమేయం లేకుండానే జరిగిపోతుందంటూ బాధపడుతుంటాడు. దీంతో దీప కోపంగా చూస్తూ అంత కీలు బొమ్మల ఎలా మారిపోయారంటుంది. 

25 తారిఖున పెళ్లి అంటున్నారు దాని మాటేంటి అనగానే కార్తీక్‌ నాకు ‘నా భార్య పిల్లలె ముఖ్యం’ అంటాడు. దీంతో మరీ మోనిత ఒక్కతే వెళ్లి తాళి, పూల దండ వేసుకుని వస్తుందా అని అని చెప్పడంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయానని, మోనితను ఫ్రెండ్‌లాగే చూశాను కానీ తను నాకు నరకం చూపిస్తుందంటాడు. నువ్వు అన్నట్లుగా నన్ను కీలు బోమ్మను చేసి ఆడుకుంటోందని, ఫోన్‌ ఎత్తకపోతే బెదిరింపులు, కలవకపోతే హెచ్చరికలు, తనతో కలిసి బయటకు వెళ్లకపోతే సాధింపలు పదే పదే తప్పును అడ్డం పెట్టుకుని నన్ను మరబోమ్మలా మార్చేసింది దీప దగ్గర విలపించుకుంటాడు కార్తీక్‌.

అంతేగాక ఈ పెళ్లికి నిన్ను, అమ్మను తీసుకువెళ్లి సాక్షి సంతకం పెట్టించమని కండీషన్‌ కూడా పెట్టిందని దీపతో చెప్పడంతో షాక్‌ అవుతుంది. ఇలా వారి మధ్య వాదన జరుగుతుండా హిమ, శౌర్యలు వస్తారు. వారు రాగానే కార్తీక్‌ తల దించుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top