సంక్రాంతి రేసులో నా పేరు శివ 2 | Karthi Naa Peru Shiva 2 Release On January 13 | Sakshi
Sakshi News home page

Karthi: నా పేరు శివ 2 రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Jan 6 2022 7:38 AM | Updated on Jan 6 2022 7:38 AM

Karthi Naa Peru Shiva 2 Release On January 13 - Sakshi

కార్తీ కెరీర్‌లో మంచి విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం ‘నాన్‌ మహాన్‌ అల్ల’ (తెలుగులో ‘నా పేరు శివ’). తాజాగా కార్తీ ‘నా పేరు శివ 2’తో తెలుగు తెరపై కనిపించనున్నారు.

తమిళ హీరో కార్తీ ‘ఆవారా, యుగానికి ఒక్కడు, నా పేరు శివ’ వంటి అనువాద చిత్రాల ద్వారా ఇక్కడ మంచి మార్కెట్‌ పెంచుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో చేసిన స్ట్రయిట్‌ చిత్రం ‘ఊపిరి’తో ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా కార్తీ ‘నా పేరు శివ 2’తో తెలుగు తెరపై కనిపించనున్నారు.

కార్తీ కెరీర్‌లో మంచి విజయాన్ని నమోదు చేసుకున్న ‘నాన్‌ మహాన్‌ అల్ల’ (తెలుగులో ‘నా పేరు శివ’), ఆవారా, యుగానికి ఒక్కడు చిత్రాలను నిర్మించిన స్టూడియో గ్రీన్‌ కేఈ జ్ఞానవేల్‌ రాజా ఈ ‘నా పేరు శివ 2’కి నిర్మాత. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. పా. రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్యాథరీన్‌ థెరిసా కథానాయికగా నటించారు. ‘‘ఈ నెల 13న ‘నా పేరు శివ 2’ని థియేటర్లలో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement