Kareena Kapoor Second Son Image: కరీనా రెండో కొడుకు ఫోటో షేర్‌ చేసిన రణ్‌ధీర్‌ - Sakshi
Sakshi News home page

కరీనా రెండో కొడుకు ఫోటో షేర్‌ చేసిన రణ్‌ధీర్‌

Apr 6 2021 2:26 PM | Updated on Apr 6 2021 5:05 PM

Kareena Kapoor Father Accidentally Shares First Pic Of her Second Child - Sakshi

బాలీవుడ్‌ స్టార్స్‌ కరీనా కపూర్‌-సైఫ్‌ అలీఖాన్‌ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా కొడుకుని భుజంపై ఎత్తుకొని ముఖం కనిపించకుండా ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అంతేగానీ ఇప్పటి వరకు తమ చిన్న కుమారుడి ఫోటోను పూర్తిగా చూపించలేదు. ఇప్పటికే తైమూర్‌కు విపరీతమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. తైమూర్‌ తమ్ముడి కోసం కూడా ఎంతోమంది అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా తన రెండో కుమారుడిని ప్రపంచానికి నెమ్మదిగా పరిచయం చేయాలన్న ఆలోచనలో సైఫ్‌ కపూల్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా కరీనా తండ్రి, నటుడు రణ్‌దీ‌ కపూర్‌ రెండో మనువడి పిక్‌ను షేర్‌ చేసేశాడు. సోమవారం రోజు ఇద్దరు పక్క పక్కనే ఉన్న ఇద్దరు శిశువుల క్లోజప్ ఫోటోను షేర్ చేశారు. వారిలో ఒకరు పెద్ద మనువడు తైమూర్‌ కాగా, మరొకరు చిన్న మనువడిగా తెలుస్తోంది. ఈ ఫోటోలో ఇద్దరు చిన్నారులు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ ఆయన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే కాసేపటికే రణధీర్‌ ఆ పోస్టును డిలీట్‌ చేశారు. కానీ అప్పటికే ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొట్టేసింది. కొంతమంది స్క్రీన్‌షాట్‌ తీసుకొని రీపోస్టు చేస్తున్నారు. రణధీర్‌ పోస్టు ఎందుకు తొలగించారో తెలియదు కానీ పిక్‌లో ఉన్నది కరీనా రెండో కొడుకేనని నెటిజన్లు ఊహించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా నటుడు సైఫ్‌ అలీఖాన్‌ గతంలో అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా అలీఖాన్‌, ఇబ్రహీమ్‌ అలీఖాన్‌. అయితే ఆమెతో విడిపోయిన తర్వాత సైఫ్‌ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్నాడు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2016 డిసెంబర్‌లో తైమూర్‌ మొదటి సంతానంగా జన్మించాడు. సుమారు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత అతడికి తమ్ముడు పుట్టాడు. సెకండ్‌ బేబీకి పేరును ఇంకా వెల్లడించలేదు.

చదవండి:
జస్ట్ నెల రోజులకే.. కరీనా రెడీ!
తైమూర్‌కు తమ్ముడొచ్చాడు

Advertisement
 
Advertisement
Advertisement