Karan Kundrra Kisses Farah Khan Hands, See Tejasswi Prakash Reaction Goes Viral - Sakshi
Sakshi News home page

Karan Kundrra: ప్రేయసిని పట్టించుకోకుండా వేరొకరి చేతికి ముద్దులు పెట్టిన నటుడు

Jun 13 2022 2:18 PM | Updated on Jun 13 2022 2:51 PM

Karan Kundrra Kisses Farah Khan Hands, See Tejasswi Prakash Reaction Goes Viral - Sakshi

ఫ్యాన్స్‌ ఈ జంటను తేజ్‌రాన్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. తాజాగా ఈ లవ్‌బర్డ్స్‌ ఖాత్ర ఖాత్ర షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణ్‌.. ఫరా ఖాన్‌ చేతులను ముద్దు పెట్టుకున్నాడు. 

బుల్లితెర జంట తేజస్వి ప్రకాశ్‌, కరణ్‌ కుంద్రా నిత్యం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. బిగ్‌బాస్‌ షోలో వారి లవ్‌స్టోరీ చూసి ఫిదా అయిన ఫ్యాన్స్‌ ఈ జంటను తేజ్‌రాన్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. తాజాగా ఈ లవ్‌బర్డ్స్‌ ఖాత్ర ఖాత్ర షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణ్‌.. ఫరా ఖాన్‌ చేతులను ముద్దు పెట్టుకున్నాడు. 

తేజ్‌ మీద నీకు ప్రేమ లేదా? అని ఫరా ఖాన్‌ అడగ్గా.. అబ్బే.. మా మధ్య ఏముంది? ఏమీ లేదని బదులిచ్చాడు కరణ్‌. ఇంతలో తేజస్వి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నిజంగానే మన మధ్య ఏం లేదంటున్నావా? అని అడుగుతుంది. మేడమ్‌, నేనేం చెప్తున్నానంటే.. నాకూ, తేజుకు పెళ్లి ఫిక్స్‌ అయింది. ఆ ముహూర్తం డేట్‌ చెప్తున్నానని కవర్‌ చేస్తాడు. దీంతో ఫరా బుంగమూతి పెట్టుకుని అక్కడి నుంచి అలిగి వెళ్లిపోతుంది. ఇంతలో కమెడియన్‌ భారతీ సింగ్‌ వచ్చి నీకు నేనున్నానంటూ కరణ్‌ మీద ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఇదంతా స్కిట్‌ అని ఇట్టే అర్థమవుతోంది. ఏదేమైనా ఈ వీడియో చూసిన ఫ్యాన్స్‌ పడీపడీ నవ్వుతున్నారు.

చదవండి: బస్‌ దిగేలోగా నా బ్యాగులోని డబ్బు, కార్డులు, వస్తువులు మాయమయ్యాయి
మాజీ భర్త మోసం చేస్తే సల్మాన్‌ సాయం చేశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement