Actor Ravi Prasad Death: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రవి ప్రసాద్ మృతి

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ టీవీ నటుడు మాండ్య రవి(43) అలియాస్ రవిప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని బీజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఒక కుమారుడు ఉన్నారు. రవిప్రసాద్ హఠాన్మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: రణ్‌వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే..
కాగా ఫేమస్ రచయిత డాక్టర్ హెచ్ఎస్ ముద్దెగౌడ కుమారుడే ఈ మాండ్య రవి. ఆయన కన్నడలోనే కాదు తెలుగు, తమిళ భాషల్లో సైతం పలు సీరియల్స్‌లో నటించారు. డైరెక్టర్ టీఎన్ సీతారాం తెరకెక్కించిన పలు సీరియల్స్‌లో ఆయన గుర్తింపు పొందారు. డైరెక్టర్ టీఎస్ నాగాభరణ తెరకెక్కించిన మహామయి సిరీయల్ ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన రవిప్రసాద్ ‘చిత్రలేఖ’, ‘వరలక్ష్మి’, ‘ముక్కత ముక్త’, ‘యశోదే’ వంటి సీరియల్స్‌తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
చదవండి: మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు