అన్నీ మారాయి... అవి తప్ప! | Kangana Ranaut wraps Thalaivi schedule | Sakshi
Sakshi News home page

అన్నీ మారాయి... అవి తప్ప!

Oct 12 2020 12:28 AM | Updated on Oct 12 2020 12:28 AM

Kangana Ranaut wraps Thalaivi schedule - Sakshi

‘కరోనా తర్వాత చాలా విషయాలు మారాయి. కానీ దర్శకుడు యాక్షన్‌ అని చెప్పి, మళ్లీ కట్‌ చెప్పడం, షూటింగ్‌... ఇవి మాత్రం ఏమీ మారలేదు’ అంటున్నారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ఆమె టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న  చిత్రం ‘తలైవి’. దివంగత నటి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఏఎల్‌ విజయ్‌ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే చెన్నైలో ప్రారంభించారు. అసెంబ్లీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌ ముగిసింది. షూటింగ్‌కి సంబంధించి కొన్ని స్టిల్స్‌ షేర్‌ చేసి, ‘జయ అమ్మ ఆశీర్వాదాలతో మరో షెడ్యూల్‌ను పూర్తి చేశాం’ అని ట్వీట్‌ చేశారు కంగనా రనౌత్‌.

Advertisement
 
Advertisement
Advertisement