రాణి రావడం ఖాయం  | Sakshi
Sakshi News home page

రాణి రావడం ఖాయం 

Published Sun, Feb 25 2024 1:29 AM

Kangana Ranaut Queen 2 Update Revealed by Vikas Bahl - Sakshi

బాలీవుడ్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘క్వీన్‌’కు సీక్వెల్‌గా ‘క్వీన్‌ 2’ని రూపొందించే చాన్స్‌  ఉందని ఈ చిత్రదర్శకుడు వికాస్‌ బాల్‌ చెబుతున్నారు. కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో రాజ్‌కుమార్‌ రావు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్వీన్‌’. 2014 మార్చి 7న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘క్వీన్‌’ సీక్వెల్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు వికాస్‌. ‘‘క్వీన్‌’ సినిమా విడుదలై దాదాపు పదేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ చాలామంది నన్ను ‘క్వీన్‌ 2’ సినిమా గురించే అడుగుతున్నారు.

‘క్వీన్‌ 2’కి కథ రెడీగానే ఉంది. ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను కానీ క్వీన్‌ రావడం ఖాయం’’ అన్నారు వికాస్‌. ఇక ఈ సీక్వెల్‌లోనూ కంగనా రనౌత్‌నే కథాకానాయికగా తీసుకుంటారా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. వికాస్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సైతాన్‌’ మార్చి 8న విడుదల కానుంది. ఈ సినిమాలో అజయ్‌ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్‌ రోల్స్‌ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే వికాస్‌ ‘క్వీన్‌ 2’ గురించి వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement