Kalyan Dev Reaction On Allu Sneha Reddy Latest Photo Shoot Pics, Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Sneha Reddy: స్నేహారెడ్డి ఫోటో చూసి కల్యాణ్‌ దేవ్‌ ఏమన్నారంటే..

Aug 16 2022 1:00 PM | Updated on Aug 16 2022 2:07 PM

Kalyan Dev Reacts On Allu Sneha Reddy Latest Photo Shoot - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డికి సోషల్‌మీడియాలో మాంచి ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ యాక్టివ్‌గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ప్రముఖ డిజైనింగ్‌ శారీలో స్నేహారెడ్డి స్టన్నింగ్‌ లుక్‌లో కనిపించారు. సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ స్నేహకు స్టైలింగ్‌ చేశారు. స్నేహారెడ్డి పోస్ట్‌ చేసిన ఫోటోపై చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ రియాక్ట్‌ అవుతూ  హాట్‌ ఎమోజీతో స్నేహా.. అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం స్నేహా షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Advertisement
 
Advertisement
Advertisement