Kalyan Dev Emotional About His Daughter, Shares Video - Sakshi
Sakshi News home page

Kalyan Dev : విడిపోయిన శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌.. ఈ వీడియోనే సాక్ష్యమా?

May 10 2023 3:08 PM | Updated on May 10 2023 3:30 PM

Kalyan Dev Emotional About His Daughter Shares Video - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్‌ల పెళ్లి జరగ్గా కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ కలిసున్న ఫోటోలు డిలీట్‌ చేసేయడం సహా మెగా ఫ్యామిలీలో జరిగే ఏ పార్టీలోనూ కల్యాణ్‌ దేవ్‌ కనిపించకపోవడంతో ఈ రూమర్స్‌ నిజమనే టాక్‌ గట్టిగానే వినిపిస్తుంది.

మరోవైపు ఇప్పటివరకు ఈ పుకార్లపై నేరుగా స్పందించకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఇన్‌డైరెక్ట్‌ హింట్స్‌ ఇస్తున్నారు. తాజాగా కల్యాణ్‌ దేవ్‌ షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ చూస్తే వీరిద్దరి మధ్య ఎంత అగాధం ఉందన్నది స్పష్టమవుతుంది. ఈ వీడియోలో ఓ స్కూల్‌ పాప కల్చరల్‌ ఈవెంట్‌లో పాల్గొంటుంది. తన పేరెంట్స్‌ ఎక్కడున్నారా అని స్టేజ్‌పై ఉండి వెతుక్కుంటుంది.

వాళ్ల తల్లిదండ్రులను చూడగానే సంతోషంతో చాలా ఎగ్జయిట్‌ అవుతుంది. ఈ వీడియోను కల్యాణ్‌దేవ్‌ షేర్‌ చేస్తూ.. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, సపోర్ట్‌ కావాలి. మిస్సింగ్‌ నవిష్క, నివిత్రి అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.దీంతో భార్యభర్తలు విడిపోయినా పిల్లలకు ఇద్దరి ప్రేమ దక్కాలి అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా  గతంలోనూ కూతుళ్లను తలుచుకుంటూ కల్యాణ్‌ దేవ్‌ ఎమోషనల్‌ అయిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement