మార్చిలోనే ‘కలియుగం పట్టణం’ | Kaliyugam Pattanamlo Movie Release Date Out, Check Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Kaliyugam Pattanamlo: మార్చిలోనే ‘కలియుగం పట్టణం’

Published Tue, Feb 20 2024 10:37 AM

Kaliyugam Pattanamlo Movie Release Date Out - Sakshi

విశ్వ కార్తీక్, ఆయూషి పటేల్‌ జంటగా నూతన దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో కందుల గ్రూప్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేశ్‌ నిర్మించారు. ఈ సినిమాని మార్చి 22న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

‘‘సరికొత్త పాయింట్‌తో మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘కలియుగం పట్టణంలో’ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. చిత్రా శుక్లా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌ అరసాడ, కెమెరా: చరణ్‌ మాధవనేని.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement