సమ్మెట గాంధీ, నాగదుర్గ, రఘుబాబు
రఘుబాబు, నాగదుర్గ, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీచరణ్, అశోక్ నటించిన చిత్రం ‘కలివి వనం’. రాజ్ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాజ్ నరేంద్ర మాట్లాడుతూ– ‘‘సినిమా అంటే వినోదమే కాదు... విజ్ఞానం అని తెలియపరుస్తూ ఒక విలేజ్ డ్రామా ఎంటర్‌టైన్మెంట్‌తోపాటు సమాజానికి మంచి సందేశాన్ని ‘కలివి వనం’ ద్వారా ఇస్తున్నాం.
సినిమా చూసి బయటకి వచ్చిన ప్రేక్షకులకు మనం కూడా ఒక మొక్కను నాటాలనే ఆలోచన వస్తుంది’’ అని తెలిపారు. రఘుబాబు మాట్లాడుతూ–‘‘చెట్ల ప్రాధాన్యత, ప్రకృతి నేపథ్యంలో తీసిన ‘కలివి వనం’కి ప్రేక్షకులు పెద్ద విజయం అందించాలి’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో వస్తున్న ఈ సినిమా చిన్నది కాదు... చాలా పెద్ద సినిమా’’ అని చెప్పారు నాగదుర్గ.


