Mother's Day 2022: Kajal Aggarwal Shares First Photo of Baby Boy Neil Kitchlu - Sakshi
Sakshi News home page

Kajala Aggarwal : మథర్స్‌ డే రోజున కొడుకును పరిచయం చేసిన కాజల్‌

May 8 2022 10:13 AM | Updated on May 8 2022 11:47 AM

Kajala Aggarwal Shares First Photo Of Baby Boy Neil Kitchulu - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కొడుకుకు నీల్‌ కిచ్లూ అని ఇప్పటికే పేరు పెట్టేసింది. చిన్నారి రాకతో కాజల్‌ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.  2020లో గౌతమ్‌ కిచ్లు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న కాజల్‌ ఆ తర్వాత కూడా సినిమాలు చేసింది. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత మాత్రం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది. ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఎంజాయ్‌ చేస్తోన్న కాజల్‌ డెలివరీ తర్వాత తొలిసారిగా ఒక ఫోటోను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మథర్స్‌ డే సందర్భంగా తొలిసారి తన కొడుకు నీల్‌ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నిషా అగర్వాల్‌, ఆమె కొడుకు సహా కుటుంబసభ్యులు నీల్‌ను ఎత్తుకొని ముద్దుచేస్తున్న ఫోటోలను తన సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఈ సందర్భంగా తొలిసారి తల్లైన కాజల్‌కు ప్రముఖులు సహా నెటిజన్లు మథర్స్‌ డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కాజల్‌ షేర్ చేసిన కొడుకు ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement