సెమీ షీర్‌ దుస్తుల్లో కలర్‌ఫుల్‌గా కాజల్‌

Kajal Aggarwal In Rs 13k Sheer Red Dress In The Maldives - Sakshi

కొత్త జంట కాజల్‌ అగర్వాల్‌-గౌతమ్‌ కిచ్లు మాల్దీవుల్లో హనీమూన్‌ని ఎంజాయ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సందడి చేస్తున్న ఫొటోలను కాజల్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. వెకేషన్‌లో  ఉంటూనే ట్రెండీగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా ర్యాట్‌ అండ్‌ బోవా బ్రాండ్‌కు చెందిన ఎరుపు రంగు సెమీ షీర్‌ దుస్తుల్లో కాజల్‌ మరింత కలర్‌ఫుల్‌గా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.  బీచ్‌ లొకేషన్లకు  చక్కగా సరిపోయే ఈ బ్యాక్‌లెస్‌ డ్రెస్‌ విలువ అక్షరాల 13వేల రూపాయలు. మ్యాచింగ్‌ ఇయర్‌రింగ్స్‌, హ్యాట్‌తో కాజల్‌ చాలా ట్రెండీగా కనిపిస్తుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  ఇప్పటికే మాల్దీవుల్లోని  పలు అందమైన ప్రదేశాలలో వీరిద్దరూ తీసుకున్న ఫొటోలను తన అభిమానుల కోసం షేర్‌ చేశారు కాజల్‌. ఈ ఫొటోలు నెటిజన్లను  తెగ ఆకట్టుకుంటున్నాయి. (అండర్‌ వాటర్‌లో కాజల్‌-గౌతమ్‌ల హనీమూన్‌)

తన చిరకాల స్నేహితుడు, ముంబై వ్యాపార వేత్త గౌతమ్‌ కిచ్లూను అక్టోబర్‌ 30వ తేదీన కాజల్‌ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలో ఓ ఖరీదైన హోటల్‌లో కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మద్య వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరింగింది. కాగా ప్రస్తుతం కాజల్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’లో మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటిస్తున్నారు. ‘ఆచార్య’తో పాటు ‘పారిస్ పారిస్’, ‘భార‌తీయుడు 2’, ‘ముంబై సాగా’ వంటి పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. (వైరలవుతోన్న కాజల్‌ హనీమూన్‌ ఫోటోలు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top