Kajal Aggarwal Reaches 21 Million Followers in Instagram - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal : కాజల్‌ సరికొత్త రికార్డు.. థ్యాంక్యూ చెప్పిన చందమామ

Feb 20 2022 6:46 PM | Updated on Feb 20 2022 7:32 PM

Kajal Aggarwal Reaches 21 Million Followers In Instagram - Sakshi

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌  ప్రెగ్నెన్సీ కారణంగా ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని షేర్‌ చేస్తుంది. రీసెంట్‌గా కాజల్‌ బేబీ బంప్‌ ఫోటోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి  తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా కాజల్‌ సరికొత్త రికార్డును క్రియేట్‌చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్‌ ఫాలోవర్స్‌ని సంపాదించి మరో మైల్‌స్టోన్‌ని సాధించింది.

ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్‌ చేస్తూ.. ఇంత ప్రేమను అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే కాజల్‌ నటించిన ఆచార్య చిత్రం  ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా మలయాళ సూపర్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్ నటించిన ‘హే సినామిక’కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement