చక్కని ప్రేమకథతో సాగే వినోదాత్మకంగా ‘జస్ట్‌ ఏ మినిట్‌’ | Just A Minute Movie Latest Update | Sakshi
Sakshi News home page

చక్కని ప్రేమకథతో సాగే వినోదాత్మకంగా ‘జస్ట్‌ ఏ మినిట్‌’

May 23 2023 9:59 AM | Updated on May 23 2023 10:02 AM

Just A Minute Movie Latest Update - Sakshi

అభిషేక్‌ పచ్చిపాల, నాజియాఖాన్‌, వినీషా, ఇషిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జస్ట్‌ ఏ మినిట్‌’. పూర్ణస్‌ యశ్వంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  రెడ్‌ స్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంతో కలిసి డా.ధర్మపురి ప్రకాష్‌ నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌ పనుల్లో ఉంది.  ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరు చక్కని ప్రశంసలు అందించారు. త్వరలో చిత్రాన్ని థియేటర్‌లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

(చదవండి: హీరోయిన్‌ డింపుల్‌ హయాతిపై క్రిమినల్‌ కేసు నమోదు)

దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘చక్కని ప్రేమకథతో సాగే వినోదాత్మక చిత్రమిది. ‘ఏడు చేపల కథ’ సినిమాతో ప్రేక్షకాదరణ పొందిన అభిషేక్‌ పచ్చిపాల ఇందులో హీరోగా చక్కని నటన కనబర్చారు. ఆయన సినిమా సినిమాకు డిఫరెంట్‌ జానర్‌ కథలు ఎంచుకుంటున్నారు.

‘ఏడు చేపల కథ’తో ఎంటర్‌టైన్‌మెంట్‌, ‘వైఫై’ చిత్రంతో ఫ్యామిలీ డ్రామాతో అలరించారు. ఇప్పుడీ చిత్రంతో కామెడీ, లవ్‌ ఎంటర్‌టైనర్‌తో అలరించనున్నారు. జబర్దస్త్‌ ఫణి కామెడీ హైలైట్‌గా ఉంటుంది. టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. ‘బుల్లెట్‌ బండి’తో పాపులర్  అయిన ఎస్‌.కె.బాజీ ఈ చిత్రానికి చక్కని బాణీలు అందించారు. పదహారేళ్ళ రేయాన్ మహ్మద్ ఈ చిత్రం టైటిల్ ట్రాక్ చేయడం విశేషం. ఇందులో ఉన్న నాలుగు పాటలు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం సెన్సార్‌ పనుల్లో ఉంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’ అని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement