Case Registered Against Dimple Hayathi In Jubilee Hills Police Station - Sakshi
Sakshi News home page

Dimple Hayathi: ఐపీఎస్‌ కారును ఢీకొట్టి వీరంగం సృష్టించిన డింపుల్‌

May 23 2023 8:21 AM | Updated on May 23 2023 11:58 AM

Case Registered Against Dimple Hayathi In Jubilee Hills Police Station - Sakshi

హీరోయిన్‌ డింపుల్‌ హయాతిపై క్రిమినల్‌ కేసు నమోదయ్యింది. ఐపీఎస్‌ అధికారి కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు హంగామా చేసిందన్న ఆరోపణలతో ఆమెపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఐపీఎస్‌ అధికారి, ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే నివాసముంటున్నారు.

అదే అపార్ట్‌మెంట్‌లోని టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్‌ హయతీ తన స్నేహితుడు విక్టర్‌ డేవిడ్‌తో కలిసి నివాసం ఉంటున్నారట. అయితే ఐపీఎస్‌ అధికారి కారు పార్క్‌ చేసే స్థలంలో డింపుల్‌, ఆమె స్నేహితుడు తమ బీఎండబ్ల్యూ కారును పెట్టడంతోపాటు పలుమార్లు గొడవకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. డీసీపీ  వాహనానికి ఉన్న కవర్‌ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్‌లను కాలితో తన్నడం వంటివి చేశారు. 

ఇదే క్రమంలో ఈ నెల 14న డీసీపీ వాహనాన్ని డింపుల్‌ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు కారును కాలితో తన్నుతూ వీరంగం సృష్టించింది. ఇదేంటని ప్రశ్నించిన డ్రైవర్‌తోనూ గొడవకు దిగింది. ఇదే విషయంపై డింపుల్‌, ఆమె స్నేహితుడు విక్టర్‌ డేవిడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలె డింపుల్‌ గోపీచంద్‌తో కలిసి రామబాణం అనే సినిమాలో నటించింది. 

Advertisement
 
Advertisement
Advertisement