‘ప్లీజ్‌ నా చెవిరింగు వెతికివ్వండి’ | Juhi Chawla Asks Twitter To Help Find Lost Earring | Sakshi
Sakshi News home page

వైరలవుతోన్న నటి ట్వీట్‌

Dec 14 2020 2:16 PM | Updated on Dec 14 2020 2:28 PM

Juhi Chawla Asks Twitter To Help Find Lost Earring - Sakshi

బాలీవుడ్‌ నటి జూహీ చావ్లా ట్విట్టర్‌ వేదికగా చేసిన ఓ రిక్వెస్ట్‌ ప్రస్తుతం తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇంతకు దేనికి సంబంధించి ఆ రిక్వెస్ట్‌ అంటే జూహీ చావ్లా డైమండ్‌ ఇయర్‌ రింగ్‌ పొగొట్టుకున్నారు. దయచేసి తనకు సాయం చేయమని.. మంచి రివార్డు కూడా ఇస్తానంటూ ట్వీట్‌ చేశారు జూహీ చావ్లా. ఆదివారం సాయంత్రం చేసిన ఆ ట్వీట్‌లో ఇలా ఉంది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్‌ 2లోని గేట్‌ నంబర్‌ 8వైపు ప్రణామ్‌ బగ్గీలో నడుచుకుంటూ వెళ్లాను. ఎమిరెట్స్‌ కౌంటర్‌లో చెక్ చేశారు. సెక్యూరిటీ చెక్‌ ఇమ్మిగ్రేషన్‌ కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో నా డైమండ్‌ ఇయర్‌ రింగ్‌ ఒకటి ఎక్కడో జారి కింద పడిపోయింది. దాన్ని వెతకడంలో నాకు ఎవరైనా సాయం చేస్తే.. ఎంతో ఆనందిస్తాను. నా చెవి రింగు ఎవరికైనా కనిపిస్తే.. పోలీసులకు అందించండి. మీకు రివార్డు కూడా ఇస్తాను అన్నారు. అంతేకాక పోయిన దాని జత ఇయర్‌ రింగ్‌ ఫోటోని షేర్‌ చేశారు జూహీ చావ్లా. ఇక దానితో పాటు గత పదిహేనేళ్లుగా ప్రతి రోజు నేను ఈ చెవి దుద్దులను ధరిస్తూ ఉన్నాను. దయచేసి దీన్ని వెతకడంలో నాకు సాయం చేయండి’ అంటూ ట్వీట్‌ చేశారు జూహీ చావ్లా. ప్రస్తుతం ఈ ట్వీట్‌ టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. (చదవండి: మీ టూ వల్ల తప్పించుకున్నాను!)

ఇక సినిమాల విషయానికి వస్తే.. జూహీ చివరి సారిగా 2019లో వచ్చిన ‘ఏక్ లడ్కి కో దేఖా తో ఐసా లగా’ చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో సోనమ్‌ కపూర్‌, అనిల్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement