ఎన్టీఆర్‌ డ్రాగన్‌? | Jr Ntr And Prashanth Neel Next To Be Titled Dragon, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Jr NTR And Prashanth Neel Movie: ఎన్టీఆర్‌ డ్రాగన్‌?

Published Sat, May 18 2024 3:27 AM

Jr NTR and Prashanth Neel next to be titled Dragon

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభం అవుతుందని, చిత్రీకరణ ప్రధానంగా విదేశాల్లో ఉంటుందనే టాక్‌ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావొచ్చనే ఊహాగానాలూ ఇటీవల తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

కాగా ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి సరికొత్త వివరాలు వెల్లడి కానున్నాయని తెలిసింది. మరోవైపు ‘డ్రాగన్‌’ టైటిల్‌ హక్కులు బాలీవుడ్‌ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ దగ్గర ఉన్నాయని, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అండ్‌ టీమ్‌ అడగడంతో ఈ టైటిల్‌ను కరణ్‌ ఇచ్చేశారని బాలీవుడ్‌ సమాచారం. మరి.. ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లోని సినిమాకు ఫైనల్‌గా ‘డ్రాగన్‌’ టైటిల్‌ ఖరారవుతుందా? వెయిట్‌ అండ్‌ సీ. 

Advertisement
 
Advertisement
 
Advertisement