కొలంబో కాలింగ్‌ | Jr NTR and Prashanth Neel Dragon Shooting Update | Sakshi
Sakshi News home page

కొలంబో కాలింగ్‌

Mar 10 2025 3:34 AM | Updated on Mar 10 2025 3:34 AM

Jr NTR and Prashanth Neel Dragon Shooting Update

కొలంబో వెళ్లనున్నాడట డ్రాగన్‌. ఎన్టీఆర్‌(Jr NTR) హీరోగా ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ  ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఇందులో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గత నెల 20న ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలోప్రారంభమైంది.

కానీ ఈ షూటింగ్‌ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ పాల్గొనలేదని తెలిసింది. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ పాల్గొంటారు. ఈ షూటింగ్‌ షెడ్యూల్‌ శ్రీలంకలోని కొలంబోలో జరగనుందట. ఆల్రెడీ యూనిట్‌లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న రిలీజ్‌ కానుంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement