Jr NTR And Koratala Siva Movie Shooting Starts In February 2022, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

Jr NTR-Koratala Siva: ప్రతీకార కథాంశంతో కొరటాల, ఎన్టీఆర్‌ చిత్రం

Nov 24 2021 9:06 AM | Updated on Nov 24 2021 10:42 AM

Jr NTR And Koratala Siva Movie Shooting Starts In February 2022 - Sakshi

Jr NTR Koratala Siva New Movie: ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న జూ. ఎన్టీఆర్‌ త్వరలోనే కొరటాల శివతో మూవీని మొదలు పెట్టనున్నాడు.  ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మరోసారి వీరి కాంబినేషన్‌లో సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కథా నేపథ్యం ఏమై ఉంటుంది? ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే విషయాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

చదవండి: హ్యాపీ మూడ్‌లో చై, ఆకట్టుకుంటున్న లుక్‌

కాగా ఈ చిత్రం ప్రతీకార కథాంశంతో తెరకెక్కబోతున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్ర సరికొత్తగా ఉంటుందని, మాస్‌ అంశాలతో పాటు సామాజిక సందేశం మేళవించి తెరకెక్కించబోతున్నారని తెలిసింది. నందమూరి కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్‌లో మొదలుకానున్నదని సినీ వర్గాల నుంచి సమాచారం. 

చదవండి: కుటుంబంతో ఎన్టీఆర్‌ ఫారిన్‌ టూర్‌, అరుదైన ఫొటోలు షేర్‌ చేసిన తారక్‌

Advertisement
 
Advertisement
Advertisement