‘కోట్లు సంపాదించాలని జర్నలిజాన్ని ఎంచుకోరు’ | Sakshi
Sakshi News home page

‘కోట్లు సంపాదించాలని జర్నలిజాన్ని ఎంచుకోరు’

Published Sat, Jan 30 2021 1:40 AM

Journalist Telugu Movie Trailer Launch - Sakshi

‘గంగపుత్రులు’ చిత్రం  ఫేమ్‌ రామ్‌కీ హీరోగా నటించి, నిర్మించిన  చిత్రం ‘జర్నలిస్ట్‌’. కె. మహేష్‌ దర్శకత్వం వహించారు. తషు కౌశిక్‌ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్, సీనియర్‌ నటుడు సురేష్‌ కీలక పాత్రల్లో నటించారు. రాజ్‌ కుమార్‌ సమర్పణలో జి.ఆర్‌.కె ఫిలింస్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌కీ మాట్లాడుతూ– ‘‘సామాజిక దృక్పథంతో ఉండే వారంటే నాకెంతో ఇష్టం. అలా ఉండే వ్యక్తుల్లో మొదట జర్నలిస్ట్‌లు ఉంటారు. 

అందుకే వారిపై ఈ సినిమా చేశాను. సమాజానికి, జనాలకి మంచి చేయాలనే ఉన్నతమైన అభిప్రాయంతో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకుంటారే కానీ, కోట్లు సంపాదించాలని కాదు. నిజమైన జర్నలిస్ట్‌ ఎంత బాధ్యతతో ఉంటాడో చూపించే ప్రయత్నమే మా సినిమా. కథ నచ్చడంతో ఎన్‌. శంకర్‌ నటించారు. సీనియర్‌ నటులు చలపతిరావు, సురేష్‌ అందించిన సహకారం ఎప్పటికీ మరువలేను’’ అన్నారు. ‘‘సమాజంలో జర్నలిస్ట్‌ పాత్ర ఎంత గొప్పదో మా చిత్రంలో చూస్తారు’’ అన్నారు సమర్పకులు రాజ్‌కుమార్‌. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, డా. జోస్యభట్ల, కెమెరా: ముజీర్‌ మాలిక్‌.

Advertisement
Advertisement