Vijay Beast Movie: 'బీస్ట్‌' నుంచి మరో సాంగ్‌.. 'జాలీ ఓ జింఖానా' అంటూ విజయ్‌ సింగింగ్‌

Jolly O Gymkhana Song Released From Vijay Beast Movie - Sakshi

Jolly O Gymkhana Song Released From Vijay Beast Movie: తమిళ స్టార్ హీరో విజయ్‌, టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే జోడిగా నటించిన చిత్రం బీస్ట్‌. ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కోలీవుడ్‌ మ్యూజిక్‌ సెన్సెషన్‌ అనిరుద్ రవిచంద్రన్‌ ఈ బీస్ట్‌కు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకూ ఈ  సినిమా నుంచి విడుదలైన 'అరబిక్ కుతు' సాంగ్ ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజైన ఈ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. 

తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌ రెండో సింగిల్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. 'జాలీ ఓ జింఖానా' అంటూ సాగే ఈ లిరికల్‌ సాంగ్‌లో విజయ్‌, పూజా వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌, డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కనిపించి అలరించారు. అంతేకాకుండా ఈ పాటను హీరో విజయ్‌ పాడటం విశేషం. ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరీ ఈ పాట 'అరబిక్‌ కుతు'ను బీట్‌ చేస్తుందా ? అంతకు మించి  పాపులారిటీని దక్కించుకుంటుందా? చూడాలి. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top