తలైవి వచ్చేది అప్పుడే! | Jayalalithaa Biopic Thalaivi Gets Release Date | Sakshi
Sakshi News home page

తలైవి వచ్చేది అప్పుడే!

Feb 25 2021 8:52 AM | Updated on Feb 25 2021 9:00 AM

Jayalalithaa Biopic Thalaivi Gets Release Date - Sakshi

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘తలైవి’. కాగా, ఈ సినిమాను ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటించారు. యంజీఆర్‌ పాత్రను అరవింద్‌ స్వామి చేశారు. బుధవారం జయలలిత జయంతి సందర్భంగా ‘తలైవి’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 23న ‘తలైవి’ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

ఈ చిత్రాన్నిఇప్పుడు మూడు భాషలలో విడుదల చేయనున్నారు.  దీన్ని మొదటగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘తలైవి’ చిత్రానికి హిందీలో ‘జయ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. దీనిలో జయలలితా రాజకీయ జీవితంలో ఎదురుకున్న సవాళ్ళను చూపేడుతున్నట్లు సినిమావర్గాలు తెలిపాయి. ప్రేక్షకులు, తమ అభిమాన నాయకురాలిని రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి సినిమాతెరపై చూడటానికి తెగ ఆసక్తి చూపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement