తల్లి ఆశీస్సులతో 16 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చా..

Jayachitra Says That She Entered Film Industry At Age Of 16 Years - Sakshi

సీనియర్‌ సినీనటి జయచిత్ర

నేడు మాతృదినోత్సవం

సాక్షి ప్రతినిధి, చెన్నై: నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లి కనిపించే దైవం వంటిదని సీనియర్‌ నటి, నిర్మాత, దర్శకురాలు జయచిత్ర అన్నారు. కన్నతల్లిని మించిన దైవం ఈలోకంలో మరొకటి లేదన్నారు. ఈనెల 9వ తేదీన మాతృదినోత్సవం సందర్భంగా ఆమె శనివారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక వ్యక్తి జీవితంలో ఎంత ఎదిగినా, అనేక విజయాలు సాధించినా అంతగా తీర్చిదిద్దిన కన్నతల్లిని ఎప్పుడూ మరువరాదన్నారు. బిడ్డలు ప్రయోజకులు కావడం తల్లిదండ్రులకు ఆనందం అన్నారు.

ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులను కాపాడుకోవాలని, పదహారేళ్ల ప్రాయంలో సినీ జీవితంలోకి అడుగుపెట్టి పరిశ్రమలో గుర్తింపు, గౌరవం, హోదా దక్కించుకున్నానంటే తన తల్లి జయశ్రీ ఆశీస్సులే ప్రధాన కారణమని తెలిపారు. తన కృషికి తల్లిదీవెన తోడు కావడంతో సినీ పరిశ్రమలో రాణించగలిగానని చెప్పారు. అలాగే తన కుమారుడు అమ్రీష్‌కు తన దీవెనలు రక్షగా నిలిచాన్నారు. సినీసంగీత దర్శకుడిగా ఎదిగి పేరు ప్రతిష్టలు గడించాడని, తన కుమారుడు సైతం ఇటీవల కొన్ని సంఘటనల నుంచి బయటపడ్డాడని, ఈ మాతృదినోత్సవాన్ని కలిసి జరుపుకోవడం తల్లిగా తన అదృష్టమని జయచిత్ర చెప్పుకొచ్చారు.

చదవండి: ఓటీటీలోకి నయనతార కొత్త సినిమా.. మే 9 నుంచి స్ట్రీమింగ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top