Janhvi Kapoor Opens About Her Relation with Ishaan Khatter - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: అతని మేసేజ్‌కు రిప్లై ఇచ్చా అంతే: జాన‍్వీ కపూర్

Nov 4 2022 7:30 PM | Updated on Nov 4 2022 8:50 PM

Janhvi Kapoor Opens About Her Relation with Ishaan Khatter - Sakshi

జాన్వీ కపూర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'మిలి'. బాలీవుడ్‌లో రిలీజైన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది జాన్వీ కపూర్. తన సినీ కెరీర్‌ ప్రారంభం గురించి వెల్లడించింది. జాన్వీ కపూర్ తన తొలి సినిమా 2018లో వచ్చి 'ధడక్‌'లో ఇషాన్‌ కట్టర్‌తో కలిసి ఆరంగేట్రం చేసింది. తాజాగా వీరిద్దరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఫోన్ బూత్'లో ఇషాన్ కట్టర్‌ నటించారు. ఈ చిత్రం కూడా నవంబర్ 4వ తేదీనే విడుదలైంది.

(చదవండి: కలలో కూడా అదే గుర్తొచ్చేది.. పెయిన్‌ కిల్లర్స్‌ వాడాను: జాన్వీ కపూర్‌)

తన తొలి మూవీ ధడక్‌ హీరో ఇషాన్‌ కట్టర్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని గతంలో రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని కారణాలతో వీరిద్దరూ విడిపోయారని గతంలో వచ్చిన వార్తలపై తాజాగా జాన్వీ స్పందించారు.  జాన్వీకపూర్‌ మాట్లాడుతూ.. 'ఇటీవల అతడి నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. మేమిద్దరం మంచి స్నేహితులం. మిలి మూవీకి అతను అభినందనలు చెప్పారు. నాకెంతో చాలా సంతోషంగా అనిపించింది. అతడు నటించిన ‘ఫోన్‌బూత్‌’ సక్సెస్ కావాలని అతనికి రిప్లై ఇచ్చా' అని అన్నారు. ఫోన్‌ బూత్‌ సినిమా ట్రైలర్‌ తనకెంతో నచ్చిందన్నారు.  జాన్వీ తన తదుపరి చిత్రం రాజ్‌ కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే స్పోర్ట్స్ చిత్రంతో పాటు వరుణ్ ధావన్‌తో యాక్షన్ ఫిల్మ్ బవాల్‌లో కనిపించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement