బాండ్‌ మళ్లీ వాయిదా | James Bond film No Time To Die delayed for third time | Sakshi
Sakshi News home page

బాండ్‌ మళ్లీ వాయిదా

Jan 23 2021 5:19 AM | Updated on Jan 23 2021 5:19 AM

James Bond film No Time To Die delayed for third time - Sakshi

జేమ్స్‌ బాండ్‌ చెప్పిన చోటుకి, చెప్పిన టైమ్‌కి వచ్చేస్తాడు. కానీ జేమ్స్‌ బాండ్‌ చిత్రం మాత్రం చెప్పిన టైమ్‌కి రావడంలేదు. జేమ్స్‌ బాండ్‌ ఫ్రాంచైజీలో వస్తున్న 25వ చిత్రం ‘నో టైమ్‌ టు డై’. జేమ్స్‌ బాండ్‌ పాత్రలో డేనియల్‌ క్రెగ్‌ నటించారు. ఆయన నటించిన ఐదో బాండ్‌ చిత్రం ఇది. గత ఏడాది వేసవిలో థియేటర్స్‌లోకి ఈ సినిమా రావాల్సింది. కోవిడ్‌ వల్ల నవంబర్‌కి వాయిదా వేశారు. నవంబర్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌కి వాయిదా వేశారు. అయితే ఏప్రిల్‌లో కాదు ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలవుతుందని తాజాగా ప్రకటించారు. అక్టోబర్‌ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement