నా వరస్ట్‌ లుక్స్‌లో ఇది బెస్ట్‌:  జగ్గూభాయ్‌

Jagapathi Babu Reaction On Rajamanaar Look In Salaar Film  - Sakshi

‘నాతో నేను ప్రేమలో పడిపోయా’ అంటున్నారు జగపతిబాబు. ‘సలార్‌’లో చేస్తున్న పాత్ర గురించే ఇలా అంటున్నారు. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు చేస్తున్న రాజమన్నార్‌ పాత్ర లుక్‌ని విడుదల చేశారు. ‘‘నా వరస్ట్‌ లుక్స్‌ (విలన్‌ క్యారెక్టర్‌ లుక్స్‌ని ఉద్దేశించి)లో ఇది బెస్ట్‌. ప్రశాంత్‌ నీల్‌ సహాయంతో నటుడిగా నా బెస్ట్‌ ఇస్తాను’’ అని సోషల్‌ మీడియా ద్వారా జగపతిబాబు పేర్కొన్నారు.

‘‘కథ కీలకమైన మలుపు తిరగడానికి రాజమన్నార్‌ పాత్రే కారణం అవుతుంది. ఇప్పటికే 20 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు విజయ్‌ కిరగందూర్‌. ‘‘సలార్‌’ షూటింగ్‌ చకచకా జరుగుతోంది’’ అన్నారు ప్రశాంత్‌ నీల్‌. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన శ్రుతీహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల  కానుంది.

చదవండి : సలార్‌: బసిరెడ్డిని మించిన రాజమన్నార్‌!
హీరోగా దిల్‌రాజు తమ్ముడి కొడుకు..ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top