మిస్‌ సౌత్‌ ఇండియా ఫేమ్‌ హీరోయిన్‌గా ‘తురితమ్‌’  | Jagan, Eden Acted In Road Trip Movie | Sakshi
Sakshi News home page

జగన్‌ హీరోగా, మిస్‌ సౌత్‌ ఇండియా ఫేమ్‌ హీరోయిన్‌గా ‘తురితమ్‌’ 

Jan 31 2022 9:35 AM | Updated on Jan 31 2022 10:02 AM

Jagan, Eden Acted In Road Trip Movie - Sakshi

తమిళనాడులో రోడ్‌ ట్రావెలింగ్‌ నేపథ్యంలో రూపొందిస్తున్న తొలి చిత్రం తమదేనన్నారు. చిత్ర కథ ఎక్కడ జరుగుతుందో అక్కడే షూటింగ్‌..

తురితమ్‌ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. సండియార్‌ చిత్రం ఫేమ్‌ జగన్‌ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఇది. మిస్‌ సౌత్‌ ఇండియా కిరీటధారిణి ఈడెన్‌ ఇందులో నాయకిగా నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు ఇరుక్కు ఆనా ఇల్‌లై, పణి విళుమ్‌ నిలవు చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు హెచ్‌.వినోద్‌ శిష్యుడు శ్రీనివాసన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈయన చిత్ర వివరాలను తెలుపుతూ ఇంతకుముందు రోడ్డు ట్రావెలింగ్‌ ఇతివృత్తంతో పలు చిత్రాలు వచ్చాయన్నారు. అయితే తమిళనాడులో రోడ్‌ ట్రావెలింగ్‌ నేపథ్యంలో రూపొందిస్తున్న తొలి చిత్రం తమదేనన్నారు. చిత్ర కథ ఎక్కడ జరుగుతుందో అక్కడే షూటింగ్‌ జరిపినట్లు చెప్పారు. ఎవరు చేసిన పనులు వారి దృష్టిలో సరైనవి అనిపిస్తాయని, అయితే ఇతరుల దృష్టిలో అవి తప్పు అనిపించే అవకాశం ఉంటుందని అలాంటి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం తురితమ్‌ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement